సిఎం జగన్‌ నాయకత్వంలో పోలీసులు బాగా పనిచేస్తున్నారు

mekathoti sucharitha
mekathoti sucharitha

అమరావతి: సిఎం జగన్‌ నాయకత్వంలో అగ్నిమాపక సిబ్బంది బాగా పని చేస్తున్నారని హోంమంత్రి మేకతోటి సుచరిత అన్నారు. వైఎస్. రాజశేఖర్ రెడ్డి చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కారణంగా అగ్నిప్రమాదాలు తగ్గాయని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 175 అగ్నిమాపక కేంద్రాలు ఉండగా.. శ్రీకాకుళం జిల్లాలో 12 ఉన్నట్లు తెలిపారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలో తుఫాన్లు ఎక్కువగా వచ్చే జిల్లాలని పేర్కొన్నారు. ఈ జిల్లాల్లో అగ్నిమాపక, విపత్తుల సిబ్బంది అనేక సేవా కార్యక్రమాలు చేపట్టారని ప్రశంసించారు. ఉభయగోదావరి జిల్లాల్లో కూడా మంచి సేవలు అందించారని వెల్లడించారు. నిన్న ప్రకటించిన అవార్డులలో ఎక్కువ అవార్డులు ఏపీకే వచ్చాయని హోంమంత్రి స్పష్టం చేశారు.


తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/