లోకేశ్‌కు స‌వాల్ విసిరిన విజ‌య‌సాయి రెడ్డి

నార్కో టెస్ట్ కు రెడీ అనే దమ్ముందా చిట్టీ?.. విజ‌య‌సాయి రెడ్డి

vijayasai-reddy

అమరావతిః వైఎస్‌ఆర్‌సిపి ఎంపి గోరంట్ల మాధవ్‌ ఓ మహిళతో న‌గ్నంగా వీడియో కాల్ మాట్లాడిన‌ట్లుగా చెబుతున్న వీడియో వ్య‌వ‌హారంపై ఏపీలో అధికార‌, విప‌క్షాల మధ్య ఇంకా మాట‌ల యుద్ధం కొన‌సాగుతూనే ఉంది. సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారిపోయిన ఈ వీడియోను ఆధారం చేసుకుని టిడిపి నేత‌లు గోరంట్ల‌తో పాటు సిఎం జ‌గ‌న్‌, వైఎస్‌ఆర్‌సిపి కీల‌క నేత‌ల‌ను టార్గెట్ చేస్తున్న నేప‌థ్యంలో వైఎస్‌ఆర్‌సిపి నేత‌లూ అందుకు దీటుగానే స్పందిస్తున్నారు. తాజాగా శుక్ర‌వారం టిడిపి అగ్ర నేత నారా లోకేశ్ ల‌క్ష్యంగా వైఎస్‌ఆర్‌సిపి ఎంపీ విజ‌య‌సాయి రెడ్ది సోష‌ల్ మీడియా వేదిక‌గా దాడి చేశారు.

‘నీతిసూక్తులు చెప్పే ముందు నీ విదేశీ గర్ల్ ఫ్రెండ్సు నడుముకు తాడుచుట్టి కవ్వంలా తిప్పావే.. స్విమ్మింగ్ పూల్ లో హాఫ్ నేక్డ్ గా వాళ్లతో జలక్రీడలు ఆడావే.. వాళ్ళని తీసుకొచ్చి డ్రగ్స్, మద్యం తీసుకోలేదని, అనైతిక పనులు జరగలేదని చెప్పించు పప్పూ. నార్కో టెస్ట్ కు రెడీ అనే దమ్ముందా చిట్టీ?’ అంటూ సాయిరెడ్డి స‌ద‌రు పోస్టులో లోకేశ్‌కు స‌వాల్ విసిరారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/telangana/