పవన్ కళ్యాణ్ ను వదలని వైసీపీ నేతలు ..బుద్దిలేని సన్యాసి అంటూ కామెంట్స్

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫై వైసీపీ నేతలు మాటల యుద్ధం కొనసాగిస్తూనే ఉన్నారు. ఒకరి తర్వాత ఒకరు అన్నట్లు వరుస పెట్టి ప్రెస్ మీట్ లు పెట్టి బూతులు తిడుతున్నారు. చిత్రసీమలో రారాజుగా ఉన్న పవన్..రాజకీయాల్లో ఇలా విమర్శల పాలవ్వడం అభిమానులు తట్టుకోలేకపోతున్నారు. కామెంట్స్ రూపంలో వారి ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. కొంతమందైతే ఈ చెత్త రాజకీయాల నుండి తప్పుకోండి అని సలహా ఇస్తున్నారు.

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మంత్రి శంకర్ నారాయణ.. పవన్ కళ్యాణ్ ఒక ప్యాకేజి వీరుడు….బుద్దిలేని సన్యాసి అని నిప్పులు చెరిగారు. ప్రశ్నిస్థాననే పవన కళ్యాణ్ 2014 నుంచి 2019 వరకు ఎందుకు ప్రశ్నించలేదని నిప్పులు చెరిగారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రజలు టీడీపీ, జన సేన పార్టీల వైపు చూడటం లేదన్నారు. అలాగే హోంమంత్రి మేకతోటి సుచరిత కౌంటర్ ఇచ్చారు.

పవన్ కళ్యాణ్ తోలు తీస్తానంటున్నారు.. తోలు తీయించుకోవడానికి ఎవరు రెడీగా లేరని ఫైర్ అయ్యారు. ఆయన రెండు స్థానాల్లో నిలబడితే ప్రజలు ఆయన్ని రెండు చోట్ల తిరస్కరించారని.. వచ్చే ఎన్నికల్లో ఎన్ని చోట్ల నిలబడతారో… ప్రజలు ఆయన ఎలా యాక్సెప్ట్ చేస్తారో ప్రజలే నిర్ణయిస్తారని చురకలు అంటించారు. పవన్ కళ్యాణ్ నిలకడలేని వ్యక్తి అని ఆయన మాటల్లోనే అర్థమవుతుందని.. ఒకసారి లెఫ్టిస్టు అంటాడు.. మరోసారి బీజేపీతో చేతులు కలుపుతాడు ఇంకోసారి టిడిపితో వెళ్తాడని ఎద్దేవా చేశారు. మొత్తం మీద పవన్ కళ్యాణ్ – వైసీపీ వార్ ఇప్పట్లో ఆగేలా లేదని చెప్పాలి.