బోల్తాపడిన పెళ్లి వ్యాను..ఏడుగురి మృతి

వ్యాన్ బ్రేక్ ఫెయిల్ కావడంతో కొండపై నుంచి కిందపడిన వ్యాన్

road-accident-in-east-godavari-dist

రాజమహేంద్రవరం: తూర్పుగోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. తుంటికొండ ఘాట్‌రోడ్డులోని వెంకటేశ్వరస్వామి దేవాలయం వద్ద ఈ తెల్లవారుజామున పెళ్లి వ్యాను బోల్తా పడిన ఘటనలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పెళ్లికి హాజరై తిరిగి వెళ్తున్న సమయంలో వ్యాను బ్రేక్ ఫెయిల్ కావడంతో అదుపు తప్పి కొండపై నుంచి కిందపడినట్టు తెలుస్తోంది. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, గ్రామస్థులు సహాయక చర్యలు ప్రారంభించారు. బాధితులను మండలంలోని టాకూర్‌పాలేనికి చెందిన వారిగా గుర్తించారు. ప్ర‌మాద స‌మ‌యంలో వ్యానులో 22 మంది ప్ర‌యాణికులు ఉన్నార‌ని చెప్పారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/