సోమేశ్ కుమార్ ఫై భట్టి ఫైర్

సోమేశ్ కుమార్ ఫై సీఏల్పీ నేత భట్టి విక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేసారు. ఐఏఎస్‌లు ఏ రాష్ట్రానికి కేటాయిస్తే గౌరవంగా ఆ రాష్ట్రానికి వెళ్లి పనిచేసుకోవాలని కానీ సోమేశ్ కుమార్ లాంటి వ్యక్తి ఏపీకి వెళ్లకుండా ప్రభుత్వ అడ్వయిజర్‌గా పనిచేయడంపై ఆసక్తి ఎందుకు? అని ఆయన ప్రశ్నించారు. భూ భకాసురులు పేదల భూములు ఆక్రమించుకునేందుకు సోమేశ్ సహాయ పడ్డారని అన్నారు.

ధరణి పేరు చెప్పి కాంగ్రెస్ పేదలకు ఇచ్చిన భూములను ప్రభుత్వం లాక్కుని రియలెస్టేట్ వ్యాపారం చేస్తుందని ఆరోపించారు. ఒక్క ఇబ్రహింపట్నం నియోజకవర్గంలోనే 5 లక్షల కోట్ల విలువైన భూములు లాక్కున్నారని ఆరోపణ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 25 లక్షల కోట్ల విలువైన భూములను లాక్కునే ప్లాన్‌లో సూత్రదారి సోమేశ్ కుమార్‌ను మళ్ళీ సలహాదారు‌గా నియమించుకున్నారని అన్నారు.

ఇక తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ముఖ్య సలహాదారుగా రాష్ట్ర ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ నియమితులయ్యారు. ఇందుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ముఖ్య సలహాదారుగా సోమేశ్‌కుమార్‌కు కేబినెట్‌ హోదాను ప్రభుత్వం కల్పించింది. గతంలో సోమేశ్‌కుమార్ తెలంగాణ సీఎస్‌గా పని చేసిన విషయం తెలిసిందే.