పాక్‌ నూతన ప్రధానిగా నవాజ్ షరీఫ్ సోదరుడు షేబాజ్ షరీఫ్

PML-N nominates Shehbaz Sharif as Pakistan’s Prime Minister

ఇస్లామాబాద్‌: పాకిస్థాన్‌లో తాజాగా ముగిసిన జాతీయ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ప్ర‌తిష్టంభ‌న ఏర్ప‌డిన విష‌యం తెలిసిందే. ఏ పార్టీకి పూర్తి మెజారిటీ రాక‌పోవ‌డంతో అయోమ‌య ప‌రిస్థితి నెల‌కొన్న‌ది. ఈ నేప‌థ్యంలో మాజీ ప్ర‌ధాని న‌వాజ్ ష‌రీఫ్‌కు చెందిన పీఎంఎల్‌-ఎన్ పార్టీ కీల‌క నిర్ణ‌యం తీసుకున్న‌ది. కూట‌మి ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఆరు పార్టీలు అంగీక‌రించాయి. అయితే ప్ర‌ధాని అభ్య‌ర్థిగా షెహ‌బాజ్ ష‌రీఫ్‌ ను నియ‌మిస్తూ పీఎంఎల్‌-ఎన్ పార్టీ అధినేత న‌వాజ్ ష‌రీఫ్ నిర్ణ‌యం తీసుకున్నారు.

మాజీ ప్ర‌ధాని న‌వాజ్ ష‌రీఫ్ త‌మ్ముడే షెహ‌బాజ్ ష‌రీఫ్‌. పాక్ అధ్య‌క్షుడిగా జ‌ర్దారి బాధ్య‌త‌లు చేప‌ట్టే అవ‌కాశాలు ఉన్నాయి. ఇక పంజాబ్‌లో న‌వాజ్ కూతురు మ‌రియం న‌వాజ్ సీఎంగా బాధ్య‌త‌లు చేప‌ట్ట‌నున్నారు. అత్య‌ధిక సీట్లు గెలిచిన పీటీఐ ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయ‌లేక‌పోయింది. అయితే పీటీఐలో ఉన్న రెబ‌ల్స్‌ను ఆరు పార్టీల కూట‌మి ఆహ్వానించింది. పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో ఇమ్రాన్ మ‌ద్ద‌తుదారులు 92 స్థానాల్లో గెల‌వ‌గా, పీఎంఎల్‌- పార్టీ 79, పీపీపీ 54 సీట్ల‌ను గెలుచుకున్న‌ది.