49 దేశాలకు విస్తరించిన కరోనా వైరస్‌

తాజా నివేదికను విడుదల చేసిన డబ్ల్యూహెచ్ఓ

coronavirus -covid 19
coronavirus -covid 19

ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజాగా కరోనా వైరస్‌పై(కొవిడ్‌-19) వివరాలను వెల్లడించింది. కరోనా వైరస్ మరిన్ని దేశాలకు విస్తరించింది. కోవిడ్19 వైరస్ 49 దేశాలకు వ్యాపించగా, వ్యాధి సోకిన వారి సంఖ్య 80 వేలను దాటేసింది. ఇప్పటివరకూ అధికారికంగా వివిధ దేశాల్లో 2,800 మంది మృతి చెందినట్టు లెక్కలు అందాయని డబ్ల్యూహెచ్ఓ అధికారి ఒకరు తెలిపారు. చైనాలోని హుబే సెంట్రల్ ప్రావిన్స్ లోనే 2,744 మంది మరణించారని, ఇరాన్ లో 26 మంది, సౌత్ కొరియాలో 13 మంది, హాంకాంగ్, ఫ్రాన్స్ లో ఇద్దరు చొప్పున, ఇటలీలో 12 మంది, తైవాన్, ఫిలిప్పీన్స్ లో ఒకరు చొప్పున, జపాన్ లగ్జరీ నౌక డైమండ్ ప్రిన్సెస్ లో 8 మంది మృత్యువాత పడ్డారని వెల్లడించారు. ఇక చైనాలో 78 వేల మందికి వైరస్ సోకిందని, సౌత్ కొరియాలో 1,766 మందికి వ్యాధి నిర్ధారణ అయిందని పేర్కొన్నారు.

ఇక ఈ వైరస్ అమెరికా, కువైట్, థాయ్ ల్యాండ్, సింగపూర్, మకావ్, బెహరయిన్, ఆస్ట్రేలియా, జర్మనీ, స్పెయిన్, మలేషియా, వియత్నాం, యూకే, రష్యా, ఇరాక్, యూఏఈ, ఇండియా, ఒమన్, కెనడా, నార్త్ మెసిడోనియా, జార్జియా, బెల్జియం, అల్గేరియా, ఆఫ్గనిస్థాన్, ఎస్టోనియా, రొమేనియా, నేపాల్, కంబోడియా, నార్వే, శ్రీలంక, డెన్మార్క్ తదితర దేశాలకు విస్తరించిందని తన రిపోర్టులో పేర్కొంది.

తాజా వీడియోస్‌ కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/videos/