జైపూర్‌లో పత్రికా గేట్‌ను ప్రారంభించిన ప్రధాని

PM Modi’s address at inauguration of Patrika Gate in Jaipur via video conferencing

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోడి ఈరోజు జైపూర్‌లో పత్రికా గేట్‌ను వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ప్రారంభించారు. ఈ ఆన్‌లైన్ కార్యక్రమంలో రాజస్థాన్ గవర్నర్ కల్‌రాజ్ మిశ్రా, ఆ రాష్ట్ర సిఎం అశోక్ గెహ్లాట్, పత్రికా గ్రూప్ ఆఫ్ న్యూస్‌పేపర్స్ ఛైర్మన్ గులాబ్ కొఠారి పాల్గొన్నారు. ఈసందర్భంగా మోడి మాట్లాడుతూ.. మన జీవితాల్లో పాఠశాల, కళాశాల వంటివాటికి వెళ్తూ చదువుకోవడం పూర్తయినప్పటికీ, విజ్ఞాన సముపార్జన ప్రక్రియ అనేక సంవత్సరాలపాటు కొనసాగుతుందని, ఇది రోజువారీ ప్రక్రియ అని తెలిపారు. ఈ నేర్చుకునే ప్రక్రియలో పుస్తకాలు, రచయితలు ప్రధాన పాత్ర పోషిస్తారన్నారు. ఏ సమాజంలోనైనా విజ్ఞానవంతులు, రచయితలు సమాజానికి మార్గదర్శకులు, బోధకులు వంటివారని తెలిపారు. స్కూలింగ్ పూర్తయినప్పటికీ, నేర్చుకునే ప్రక్రియ అనేక సంవత్సరాలు కొనసాగుతుందన్నారు. ప్రతి రోజూ నేర్చుకునే ప్రక్రియ జరుగుతుందన్నారు. పుస్తకాలు, రచయితలు ఈ ప్రక్రియలో ముఖ్య భూమిక పోషిస్తారన్నారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/