ఒకే వేదికపైకి చంద్రబాబు, పవన్‌, లోకేష్

ఒకే వేదిక ఫై ముగ్గురు అగ్ర నేతలు కనిపించబోతున్నారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర 3వేల కి.మీలు అధిగమించింది. ఈ క్రమంలో యువగళం పాత్రయాత్ర విజయోత్సవ సభను నిర్వహించేందుకు సన్నాహాకాలు జరుగుతున్నాయి. ఈ నెల 20న విజయనగరం జిల్లా భోగాపురం సమీపంలోని పోలేపల్లిలో బహిరంగ సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ , హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఈ సభలో పాల్గొననున్నారు.

యువగళం ముగింపు సభకు రాష్ట్రం నలుమూలల నుంచి లక్షలాది ప్రజలు హాజరయ్యే అవకాశమున్నందున, సభ విజయవంతం చేయడానికి పార్టీ నాయకత్వం వివిధ కమిటీలను ఏర్పాటుచేసి బాధ్యతలు అప్పగించింది. ఈ కమిటీలో టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, సీనియర్ నేతలు యనమల రామకృష్ణుడు, అశోక్‌ గజపతిరాజు, సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి, గోరంట్ల బుచ్చయ్యచౌదరి, నిమ్మల రామానాయుడు, చింతకాయల అయ్యన్నపాత్రుడు, గంటా శ్రీనివాసరావు, ప్రత్తిపాటి పుల్లారావు, దేవినేని ఉమామహేశ్వరరావు ఉన్నారు.