ప్రాక్టీస్ లో కూడా సమంత ”ఊ…” అనిపించింది

ఊ అంటావా మామ ఉఉ అంటావా మామ..ఇప్పుడు ఈ సాంగ్ దేశ వ్యాప్తంగా దుమ్ములేపుతుంది. చిన్న వారి దగ్గరి నుండి ముసలివారు వరకు అంత ఈ సాంగ్ ను పాడుతున్నారు. సుకుమార్ – అల్లు అర్జున్ కలయికలో వచ్చిన పుష్ప 1 లో ఈ సాంగ్ సినిమాకే హైలైట్ గా నిలిచింది. ముఖ్యంగా ఈ ఐటెం సాంగ్ లో సమంత చిందులేయడం సాంగ్ ను మరింత వైరల్ గా చేసింది. పాట మాత్రమే కాదు పాటలో అల్లు అర్జున్ తో సమంత చేసిన స్టెప్పులు.. థియేటర్లలో అభిమానులతో ఈలలు వేయించింది. అయితే ఈ పాట కోసం సమంత చాలా కష్టపడింది. అందులో వేసే స్టెప్పుల కోసం చాలా కష్టపడ్డానని చెబుతూ మేకింగ్ వీడియో ను విడుదల చేసింది. ‘ఊ అంటావా మామా..’ పాట కోసం సామ్ చేసిన ప్రాక్టీస్ ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్​గా మారింది. ఈ వీడియోలో సామ్ పొట్టి బట్టలతో ఆకట్టుకునేలా స్టెప్పులేసింది.

సిట్టింగ్ స్టెప్ అలాగే బన్నీపై కూర్చుని చేసే హుక్ స్టెప్ కోసం సమంత చమటోడ్చాల్సి వచ్చింది. అంతే కాకుండా స్టెప్స్ విషయంలో డ్యాన్స్ మాస్టర్ భాను ఎక్కడా కాంప్రమైజ్ కాలేదంట. పాన్ ఇండియా మూవీ కావడం అంతే కాకుండా రంగస్థలంలోని `రంగమ్మా.. మంగమ్మా.. పాట మిస్సయి ఈ పాట తనని వెతుక్కుంటూ రావడంతో ఎక్కడా తగ్గేదిలే అన్నట్టుగా స్టెప్స్ విషయంలో ఎక్కడా రాజీపడలేదట.

దాంతో సమంత చమటోడ్చక తప్పలేదని వీడియోని చూస్తే తెలిసిపోతోంది. అంతే కాకుండా స్టెప్స్ విషయంలో డ్యాన్స్ మాస్టర్ తనని టార్చర్ చేశాడని నన్ను చంపేశాడని సామ్ వీడియోలో చెప్పడం విశేషం.

#OoAntavaOoOoAntava Song Behind The Scenes @Samanthaprabhu2! 🔥🔥🔥

▶️https://t.co/qKMaqbbHes#PushpaTheRise #Samantha #SamanthaRuthPrabhu pic.twitter.com/7AgzyZ6QXE— Troll Who Trolls Samantha™ (@TeamTWTS) January 6, 2022