కొబ్బరి పువ్వులో పోషకాలు

ఇంటింటా చిట్కా వైద్యం-

coconut flower
coconut flower

కొబ్బరి కాయను కొట్టినపుడు అందులో ఒక పువ్వు వస్తుంది. సాధారణంగా పువ్వు ఎప్పుడో ఒకసారి వస్తుంది. అలా వస్తే మంచిది నమ్ముతారు.

కొబ్బరి పువ్వు పరిపక్వ కొబ్బరికాయలో అభివృద్ధి చెందుతున్న మొలక. కొబ్బరి, కొబ్బరి నీళ్లు, లేత కొబ్బరిలో నీటికంటే ఎక్కువ పోషకాలు కొబ్బరి పువ్వులో ఉంటాయి.

కొబ్బరి, లేత కొబ్బరి లాగే కొబ్బరి పువ్వు కూడా మంచి రుచిగా ఉంటుంది.

కొబ్బరి పువ్వులోని పోషకాలు రోగిరోధక శక్తిని రెట్టింపు చేస్తాయి. కొబ్బరి పువ్వు కాలానుగుణంగా ఇన్ఫెక్షన్ల నుండి పూర్తి రక్షణ కల్పిస్తుంది.

కొబ్బరిపువ్వు తినడం వల్ల మంచి శక్తి లభిస్తుంది.

పువ్వు ఇన్సులిన్‌ స్రావాన్ని ప్రేరేపిస్తుంది. ఇది అధిక రక్తంలో చక్కెరను నియంత్రించడంలో సహాయపడుతుంది.

ఇది గుండెలోని కొవ్వును కూడా కరిగిస్తుంది. తద్వారా గుండెజబ్బుల నుండి రక్షిస్తుంది.

Nutrients in coconut flower

ధైరాయిడ్‌ స్రావాన్ని నియంత్రిస్తుంది. థైరాయిడ్‌ నష్టాన్ని నయం చేస్తుంది. శరీర బరువును అదుపులో ఉంచడానికి సహాయపడుతుంది.

ఇందులో కేలరీలు తక్కువగా ఉంటాయి. మూత్రపిండాల సమస్యను తగ్గిస్తుంది.

కిడ్నీ ఇన్ఫెక్షన్లనునయం చేస్తుంది. కొబ్బరిపువ్వులో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి.
ఇవి గణనీయమైన వృద్ధాప్యాన్ని నివారిస్తాయి.

ముడతలు, వృద్ధాప్యం, చర్మం కుంగిపోవడాన్ని దరి చేరనీయవు. ఎండ వచ్చే చర్మ నష్టాన్ని నివారిస్తుంది.

కొబ్బరిపువ్వులో ఉండే ఖనిజాలు, విటమిన్లు గౌట్‌ నుండి రక్షిస్తాయి. మలబద్ధకాన్ని నయం చేస్తుంది.

తాజా సినిమా వార్తల కోసం: https://www.vaartha.com/news/movies/