నేడు ప్రయాగ్‌రాజ్‌లో పర్యటించనున్న ప్రధాని

న్యూఢిల్లీ: ప్రధాని మోడీ నేడు ప్రయాగ్‌రాజ్‌లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా స్వయం సహాయక సహాయక సంఘాల బ్యాంకు ఖాతాల్లోకి రూ.వెయ్యి కోట్లు రుణాన్ని బదిలీ చేయనున్నారు. దాదాపు 16లక్షల మంది మహిళా సంఘాల సభ్యులకు ప్రయోజనం చేకూరనున్నది. దీన్‌దయాళ్‌ అంత్యోదయ యోజన జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్‌ కింద రూ.వెయ్యి కోట్లను మహిళా సంఘాల సభ్యుల ఖాతాల్లో జమ చేయనున్నారు. అలాగే కన్యా సుమంగళ పథకానికి సైతం శ్రీకారం చుట్టనున్నారు. ఈ పథకం కింద లక్ష మంది లబ్ధిదారులకు రూ.20కోట్లకుపైగా నగదును ఖాతాల్లో జమ చేయనున్నారు. ఈ పథకం కింద బాలికల జీవితంలో వివిధ దశల్లో మొత్తం రూ.15వేల నగదు బదిలీ జరుగనున్నది.

పుట్టిన సమయంలో రూ.2వేలు, ఏడాది టీకాల తర్వాత రూ.1000, ఒకటో తరగతిలో చేరిన సమయంలో రూ.2వేలు, ఆరో తరగతిలో చేరిన తర్వాత రూ.2వేలు, తొమ్మిది తరగతిలో ప్రవేశం అనంతరం రూ.3వేలు, పది లేదంటే ఇంటర్‌లో ఉత్తీర్ణత అనంతరం, డిగ్రీ ఇతర డిప్లొమా కోర్సుల్లో చేరిన అనంతరం రూ.5వేలు బాలికల ఖాతాల్లో జమ చేయనున్నారు. ఆయా పథకాలతో వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని మహిళా ఓటర్ల గాలం వేసేందుకు ప్రయత్నిస్తున్నది.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/