రోజ్ గార్ మేళా డ్రైవ్ ను ప్రారంభించిన ప్రధాని మోడీ

pm-modi-to-launch-recruitment-drive-for-10-lakh-jobs

న్యూఢిల్లీ : ప్రధాని మోడీ ఈరోజు రోజ్ గార్ మేళా డ్రైవ్ ను ప్రారంభించారు. వివిధ ప్రభుత్వ శాఖల్లో 10 లక్షల ఉద్యోగాల కోసం ఈ మెగా రిక్రూట్మెంట్ డ్రైవ్ జరుగనుంది. పీఎం రోజ్ నగర్ 2022 రిక్రూట్ మెంట్ పథకాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మెడీ ప్రారంభించారు. ఇందులో భాగంగా 75 వేల మంది అభ్యర్థులు అపాయింట్ మెంట్ లెటర్స్ అందుకోనున్నారు. ఎంపికైన అభ్యర్థులు భారత ప్రభుత్వంలోని 38 మంత్రిత్వ శాఖలు, ఇతర విభాగాల్లో పనిచేయనున్నారు.

గెజిటెడ్, నాన్ గెజిటెడ్ స్థాయిలో సర్కార్ నౌకరీలలో కేంద్ర ప్రభుత్వం నియమించనుంది. సెంట్రల్ ఆర్మ్ డ్ ఫోర్స్, ఎస్సై, కానిస్టేబుల్, ఎల్డీసీలలోకి రిక్రూట్ చేసుకోనున్నారు. అలాగే స్టెనో, పీఏ, ఇన్ కమ్ టాక్స్ ఇన్ స్పెక్టర్లు, ఎంటిఎస్ ఉద్యోగాలలో కేంద్రం రిక్రూట్ చేయనుంది. రిక్రూట్ మెంట్ నేరుగా సంబంధిత మంత్రిత్వ శాఖలు, SSC, UPSC, రైల్వే రిక్రూట్ మెంట్ బోర్డు ద్వారా జరుగనున్నాయి. వచ్చే 18 నెలల్లో ప్రభుత్వం ఈ ఖాళీ పోస్టులను భర్తీ చేయనుంది.

కాగా, పలువురు కేంద్ర మంత్రులు రోజ్ గార్ మేళాలో పాల్గోనున్నారు. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, మన్ సుఖ్ మాండవియా, అనురాగ్ ఠాకూర్, పీయుష్ గోయల్ తో పాటు మరికొందరు మంత్రులు, ప్రజాప్రతినిధులు కార్యక్రమంలో పాల్గోనున్నారు. ఎంపీలు తమ తమ నియోజకవర్గాల్లో యువతకు అపాయింట్ మెంట్ లెటర్స్ అందిచనున్నారు. రోజ్ గార్ మేళా నిర్వహించడంపై నిరుద్యోగ యువత సంతోషం వ్యక్తం చే