యూఎస్ లో రికార్డు స్థాయిలో ‘బిల్లా’ రీ రిలీజ్

ఇటీవల కాలంలో అగ్ర హీరోల తాలూకా ఓల్డ్ మూవీస్ ను సరికొత్త టెక్నలాజి ని జత చేసి రీ రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ‘పోకిరి, జల్సా, ఘరానా మొగుడు, చెన్నకేశవరెడ్డి’ వంటి సినిమాలు విడుదల చేసి అభిమానులను ఆకట్టుకున్నారు. ఇక రేపు రెబెల్ స్టార్ ప్రభాస్ పుట్టిన రోజు సందర్బంగా ప్రభాస్, అనుష్క జంటగా నటించిన బిల్లా చిత్రాన్ని రీ రిలీజ్ చేస్తున్నారు.

తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా.. యూఎస్‌లోనూ బిల్లా 4k వెర్షన్ ను రికార్డు స్థాయిలో విడుదల చేస్తున్నారు. యూఎస్‌లో ఇప్పటి వరకు 70 పైగా లొకేషన్స్‌లో విడుదల ఫిక్స్ అయినట్లుగా తెలుస్తోంది. ఇంకా నెంబర్ పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. ప్రభాస్ రేంజ్‌కు తగ్గట్టు రీ రిలీజ్ అవుతున్న ఈ సినిమాకి టికెట్స్ కూడా అదే రేంజ్‌లో అమ్ముడవుతున్నాయి.

ఇక ‘బిల్లా’ విషయానికి వస్తే.. దివంగత రెబల్ స్టార్ కృష్ఱంరాజు ఈ సినిమాలో కీలక పాత్రలో నటించారు. అనుష్క, నమిత, హన్సిక హీరోయిన్లుగా నటించారు. గోపీకృష్ణా మూవీస్ పతాకంపై దర్శకుడు మెహర్ రమేష్ తెరకెక్కించారు. స్టైలిష్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం రూపుదిద్దుకుంది.