పవన్ కళ్యాణ్ కు ఏపీ మహిళా కమిషన్ నోటీసులు

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు ఏపీ మహిళా కమిషన్ నోటీసులు నోటీసులు జారీ చేసింది. ఇటీవల పవన్ కళ్యాణ్ మహిళల ఫై చేసిన కామెంట్స్ ఫై వెంటనే క్షమాపణలు తెలుపాలని నోటీసులో పేర్కొన్నారు. మూడు పెళ్లిళ్ల పవన్ చేసిన వ్యాఖ్యలను ఉపసహరించుకోవాలని నోటీసులో పేర్కొన్నారు ఏపీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ. కోట్లు, లక్షల రూపాయల భరణం ఇచ్చి ఎవరి స్థాయిలో వారు విడాకులు ఇవ్వవచ్చూ అంటూ పవన్ చెప్పడం దారుణమన్నారు. ఎవరికి పడితే వారు భార్యలను వదిలించుకుంటూ పోతే మహిళలకు భద్రత ఉంటుందా అని ఆమె ప్రశ్నించారు. మహిళలను ఉద్దేశించి స్టెప్నీ అనే పదం వాడయం తీవ్ర ఆక్షేపనీయమని పద్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలపై పవన్ చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఓ సినిమా హీరోగా, పార్టీ అధ్యక్షుడిగా మీ మాటల ప్రభావం సమాజంపై ఉంటుందని మీకు తెలియదా అని కూడా ప్రశ్నించారు.

మిమ్మల్ని ఫాలో అవుతున్న యువత ఈ వ్యాఖ్యల్ని ఆదర్శంగా తీసుకోరా అని పద్మ ప్రశ్నించారు. మహిళలను భోగ వస్తువుగా, అంగడి సరుకుగా భావించేవారు ఇటువంటి పదాలను ఉపయోగిస్తారు. మీ వ్యాఖ్యలపై ఇప్పటికే అనేక మంది మహిళలు మాకు ఫిర్యాదు చేశారు. మీ మాటలు అవమానకరంగా మహిళా భద్రతకు పెను ప్రమాదంగా మారుతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మహిళలను కించపరిచే మాటలు మీరు మాట్లాడటం, చేతనైతే మీరు మూడు పెళ్ళిళ్లు చేసుకోవాలని పిలుపునివ్వడంపై మీరు తక్షణమే _ మహిళలకు క్షమాపణ చెప్పాలని, మీ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని రాష్ట్ర మహిళా కమిషన్‌ మీకు ఈ నోటీసును జారీ చేస్తుంది’ అంటూ నోటీసుల్లో ప్రస్తావించారు.