నేడు మరో 5 వందే భారత్ రైళ్లను ప్రారభించబోతున్న మోడీ

భారత్ లో వందే భారత్ రైళ్ల సంఖ్య పెరుగుతుంది. ఇప్పటికే పలు రైళ్లు దేశంలో పరుగులు పెడుతుండగా..నేడు మరో ఐదు రైళ్లకు ప్రధాని మోడీ పచ్చ జెండా ఉపనున్నారు. ప్రయాణికుల నుంచి వస్తున్న ఆదరణను దృష్టిలో పెట్టుకొని నేడు ప్రధాని మోడీ మధ్యప్రదేశ్ లో ఉదయం 10:30 గంటలకు 5 వందే భారత్ రైళ్లను ప్రారభించబోతున్నారు. మధ్యప్రదేశ్ లోని కమలాపతి-జబల్పూర్, ఖజురహో-భోపాల్-ఇండో ర్, మడ్ గావ్-ముంబై, ధార్వాడ్-బెంగుళూరు, హతియా-పాట్నా రూట్లలో ఈ రైళ్లు ప్రయాణించనున్నాయి.

దేశవ్యాప్తంగా వివిధ సిటీలను కలుపుతూ వెళ్లే ఈ రైళ్లను మేక్ ఇన్ ఇండియా పాలసీలో భాగంగా ఐసీఎఫ్ నిర్మించింది. కొత్తగా ప్రవేశపెట్టే ఐదు రైళ్లతో కలిసి దేశవ్యాప్తంగా వందే భారత్ రైళ్ల సంఖ్య 23కు చేరనుంది. ఇక అదనపు రూట్లలో కొత్త వందేభారత్ రైళ్లను ప్రవేశపెట్టడం వల్ల ఆయా ప్రాంతాల్లో పర్యాటకం, వాణిజ్యం, ఆర్థికావృద్ధి కూడా జరుగుతుందని కేంద్రం ఆలోచనగా ఉంది. దేశీయంగా వందేభారత్ రైళ్ల తయారీతో దేశ మ్యాన్యుఫ్యాక్టరింగ్ రంగం కూడా పురోగతి బాట పట్టనుంది.