62 రామభక్తి గీతాలను షేర్‌ చేసిన ప్రధాని మోడీ

PM Modi Shares Playlist Of His Favourite ’62 Bhajans’ Dedicated To Shri Ram Ahead Of Pran Pratishtha Ceremony

న్యూఢిల్లీః అయోధ్యలో నూతనంగా నిర్మిస్తున్న రామాలయం ప్రారంభోత్సవానికి ముందు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నిత్యం రాముడి కిర్తనలు వింటూ.. దేశవ్యాప్తంగా ఉన్న ఆలయాలను సందర్శిస్తున్నారు. పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలను కూడా చేపడుతున్నారు. ఈ క్రమంలో రాముడికి అంకితం చేసిన సుమారు 62 భక్తి గీతాలతో కూడిన ప్లేలిస్ట్‌ను ప్రధాని తన అధికారి ఎక్స్‌ ఖాతాలో శుక్రవారం షేర్‌ చేశారు. ప్లేలిస్ట్‌తో పాటు.. రామాయణ సందేశం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రజలకు ఎంతో స్ఫూర్తినిచ్చిందంటూ భజన కీర్తనలకు సంబధించిన వీడియో లింక్స్‌ను కూడా నెట్టింట పోస్టు చేశారు.

కాగా, ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య లో ఈనెల 22వ తేదీన ప్రధాని మోడీ రామాల‌యాన్ని ప్రారంభించ‌నున్న విషయం తెలిసిందే. రామ మందిరం లో బాలరాముడి ప్రాణప్రతిష్ట కోసం అన్ని ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయ్యాయి. ఈ కార్యక్రమాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నారు. ఇందులో భాగంగానే రాముడి విగ్రహ ప్రాణప్రతిష్ట వేడుకకు ముందు మోడీ 11 రోజులపాటూ అనుష్ఠాన దీక్ష కూడా చేపట్టారు. ఈ దీక్షలో భాగంగా కఠిన నియమాలను పాటిస్తున్నారు. నేలపైనే నిద్రిస్తూ.. కొబ్బరి నీళ్లను ఆహారంగా తీసుకుంటున్నారు.