భారత్‌ నుండి చైనీయుల తరలింపు

స్వదేశానికి రావాలనుకుంటున్న వారు ప్రత్యేక విమానాల్లో టికెట్లు బుక్ చేసుకోవాలి..చైనా

india- china
india- china

చైనా: భారత్‌లో కరోనా మహమ్మారి తీవ్రత రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో చైనా ఇక్కడున్న చైనీయులను స్వదేశానికి తరలించాలని నిర్ణయించింది. లాక్‌డౌన్ కారణంగా భారత్‌లో చిక్కుకుపోయిన చైనా విద్యార్థులు, పర్యాటకులు, వ్యాపారవేత్తలను వీలైనంత త్వరగా స్వదేశానికి తరలించాలని నిర్ణయించుకుంది. స్వదేశానికి రావాలనుకుంటున్న వారు ప్రత్యేక విమానాల్లో టికెట్లు బుక్ చేసుకోవాలని కోరింది. అయితే, అలా రావాలనుకున్న వారు క్వారంటైన్, ఇతర వైద్య పరమైన ఏర్పాట్లకు అంగీకరించాల్సి ఉంటుందని పేర్కొంది. కాగా, భారత్‌తో పాటు ఇతర దేశాల్లో చిక్కుకున్న చైనీయులను కూడా తరలించాలని జిన్‌పింగ్ ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలుస్తోంది. కాగా, భారతదేశంలో రోజుకు కరోనా వైరస్ వ్యాప్తి పెరుగుతోంది. ప్రస్తుతం అత్యధిక కేసులు కలిగిన దేశాల జాబితాలో భారత్ టాప్10లోకి చేరింది. అయితే కరోనా వైరస్‌పై భారత్‌ చేస్తున్న పోరులో చైనా సాయం కొనసాగుతుందని చైనా మరోసారి స్పష్టం చేసింది.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/