హైదరాబాద్‌లోప్రధాని నరేంద్రమోడీ రోడ్డు షో… మెట్రో రైల్వే స్టేషన్ల మూసివేత

భద్రతాపరమైన చర్యల్లో భాగంగా రెండు మెట్రో స్టేషన్‌ల మూసివేత

PM Modi

హైదరాబాద్‌ః హైదరాబాదులో ప్రధాని నరేంద్రమోడీ రోడ్డు షో నేపథ్యంలో భద్రతాపరమైన చర్యల్లో భాగంగా రెండు మెట్రో స్టేషన్‌లను ఈ రోజు సాయంత్రం మూసివేయనున్నారు. నేటి మధ్యాహ్నం ప్రధాని మోదీ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ నుంచి వెంకటేశ్వరస్వామి ఆర్చ్, ఓల్డ్ వైఎంసీఏ పోలీస్టేషన్ మీదుగా కాచిగూడలోని వీరసావర్కర్ విగ్రహం వరకు రోడ్డు షోలో పాల్గొననున్నారు. ఈ క్రమంలో రోడ్డు షో జరగనున్న చిక్కడపల్లి, నారాయణగూడ మెట్రో స్టేషన్లను సాయంత్రం 4.30 గంటల నుంచి సాయంత్రం 6.30 గంటల వరకు మూసివేయాలని నిర్ణయం తీసుకున్నట్లు మెట్రో అధికారులు తెలిపారు.