హైదరాబాద్ చేరుకున్న ప్రధాని మోడి

హైదరాబాద్: కరోనా వ్యాక్సిన్ అభివృద్ధిపై సమీక్షించేందుకు మూడు నగరాల పర్యటనలో భాగంగా ప్రధాని హైదరాబాద్ చేరుకున్నారు. హకీంపేట వైమానికి స్థావరానికి చేరుకున్న మోడి అక్కడి నుండి నేరుగా నగరశివార్లఓని జినోమ్‌వ్యాలీలో గల భారత్ బయోటెక్ సంస్థకు వెళ్తారు. భారత్ బయోటెక్‌లో వ్యాక్సిన్ తయారీ, పురోగతిపై సందర్శించనున్నారు. మోడి రాక సందర్భంగా భారీ ఎత్తున భద్రతా ఏర్పాట్లు చేశారు. శనివారం ఉదయం ఢిల్లీ నుంచి బయలుదేరిన మోడి.. నేరుగా గుజరాత్‌లోని అహ్మదాబాద్ చేరుకున్నారు. అక్కడి జైడస్ బయోటెక్ పార్క్ సందర్శించారు. ఈ కార్యక్రమం అనంతరం అహ్మదాబాద్ నుంచి నేరుగా హైదరాబాద్ పయనమయ్యారు. హైదరాబాద్ పర్యటన అనంతరం పుణెలోని సీరం ఇనిస్టిట్యూట్‌కు చేరుకుంటారు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/national/