కోనసీమ అల్లర్ల నిందితుడు అన్యం సాయి ఏ పార్టీ కి చెందిన వ్యక్తి..?

కోససీమ జిల్లా పేరును అంబేద్కర్ జిల్లాగా మార్చడం ఫై అమలాపురంలో మంగళవారం కోనసీమ సాధన సమితి ఆందోళన ఉద్రిక్తతకు దారి తీసిన సంగతి తెలిసిందే. ఈ ఆందోళనలో ప్రభుత్వ వాహనాలతో పాటు, పలు ప్రవైట్ వాహనాలు దగ్దమయ్యాయి. దీంతో ప్రస్తుతం పోలీసులు 144 సెక్షన్ ను అమలు చేస్తున్నారు. కాగా అల్లర్ల వెనుకున్న కుట్రకోణం ఉందని అధికార పార్టీ తో పాటు ప్రతిపక్ష పార్టీలు ఆరోపణలు చేస్తున్నారు. ఇదిలా ఉంటె అమలాపురంలో విధ్వంసం వెనుక అమలాపురానికి చెందిన అన్యం సాయి ఉన్నట్లు పోలీసులు ప్రాథమిక విచారణలో నిర్ధారించారు.

దీంతో నిందితుడిని అదుపులోకి తీసుకుని అమలాపురం స్టేషన్కు తరలించారు. విధ్వంసంపై అతడిని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. సాయిపై ఇప్పటికే రౌడీషీట్ తెరిచారు. కాగా సాయి వైసీపీ క్రియాశీల కార్యకర్త అని , మంత్రి విశ్వరూ్‌పకు అనుచరుడు అని , ఆయనకు మంత్రి పదవి వచ్చినప్పుడు అభినందనలు తెలియజేస్తూ పత్రికల్లో ప్రకటనలు కూడా ఇచ్చాడని తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తే, లేదు లేదు సాయి జనసేన పార్టీ సభ్యుడని , జనసేన కార్యక్రమాల్లో సాయి చురుగ్గా పాల్గొన్నట్టు వైస్సార్సీపీ చెపుతూ పిక్స్ ను సోషల్ మీడియా లో షేర్ చేసింది. పవన్‌, నాగబాబు, జనసేన నాయకులతో అతను దిగిన ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ప్రస్తుతం అన్యం సాయి పేరు వార్తల్లో తెగ ప్రచారం అవుతుండడం తో అంత ఇతడి గురించి మాట్లాడుకుంటున్నారు.