పిల్లలతో కలిసి ప్రధాని మోడీ అల్లరి.. వీడియో వైరల్

తాను కూడా పిల్లాడిలా మారిన వైనం

pm-modi-playing-with-children

న్యూఢిల్లీః అధికారిక కార్యక్రమాలు, రాజకీయలతో అనునిత్యం ఎంతో బిజీగా ఉండే ప్రధాని మోడీ కాసేపు చిన్నారులతో కలిసిపోయి ఆడుతూ కనిపించారు. వారితో కలిసి ఆయన కూడా పిల్లాడిలా మారిపోయారు. ఈ వీడియోను బిజెపి తమ ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసింది. మోడీ కూడా ఈ వీడియోను తన వాట్సాప్ ఛానల్లో షేర్ చేశారు. తన చిన్నారి మిత్రులతో కొన్ని గుర్తిండిపోయే క్షణాలు అని క్యాప్షన్ పెట్టారు. అయితే ఈ వీడియోను ఎప్పుడు తీశారనేది మాత్రం పేర్కొనలేదు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.