పవన్ కళ్యాణ్ అమరావతి పర్యటనలో ప్రమాదం

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అమరావతి టూర్ లో అపశృతి చోటుచేసుకుంది. ఆయన కాన్వాయ్‌ మంగళగిరి డీజీపీ కార్యాలయం వద్దకు రాగానే కాన్వాయ్‌లోని రెండు కార్లు ఢీకొన్నాయి. ప్రమాద సమయంలో ఎయిర్‌బ్యాగ్స్‌ ఓపెన్‌ కావడంతో పెనుప్రమాదం తప్పింది. అందులో ఉన్న వ్యక్తులకు ఎలాంటి ప్రమాదం జరగకపోవడం తో కార్య కర్తలు ఊపిరి పీల్చుకున్నారు. అయితే రెండు కార్లు బాగా దెబ్బ తిన్నాయి. బుధువారం అమరావతిలో జనసేన పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హాజరయ్యారు.

ఈ సందర్భంగా నాదేండ్ల మనోహర్‌ మాట్లాడుతూ… ప్రతి ఒక్కరిని గౌరవించి మాట్లాడే వ్యక్తి పవన్ కళ్యాణ్ అని… ఆడియో ఫంక్షన్ లో పవన్ కళ్యాణ్ ఏమి మాట్లాడారో ఒకసారి చూడాలని చురకలు అంటించారు. ఎల్లకాలం సినిమాలు చెయ్యాలని పవన్ కళ్యాణ్ ఎప్పుడు కోరుకోలేదని… డబ్బులు కోసం సినిమాలు కోసం పరితపించే వ్యక్తి కాదన్నారు. సినిమా ఇండస్ట్రీని కాపాడమని పవన్‌ కళ్యాణ్‌ చెప్పారన్నారు. ప్రజలకోసం పోరాటం చెయ్యడానికి రాజకియ పార్టీ పెట్టారని స్పష్టం చేశారు. ఇది అర్థం కాని మూర్ఖులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని… ఆయనపై వ్యక్తిగత దాడి చేస్తున్నారని ఫైర్‌ అయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రెస్ మీట్లు పెట్టి వ్యక్తిగత దూషణలు చేస్తున్నారని మనోహర్ అన్నారు.