చరణ్ కొత్త చిత్ర షూటింగ్ ను అడ్డుకున్న బీజేపీ కార్పొరేటర్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కొత్త చిత్ర షూటింగ్ ను బీజేపీ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి అడ్డుకున్నారు. రీసెంట్ గా ఆచార్య మూవీ లో ప్రత్యేక రోల్ లో కనిపించిన చరణ్..ప్రస్తుతం శంకర్ డైరెక్షన్లో కొత్త చిత్రాన్ని చేస్తున్నాడు. దిల్ రాజు బ్యానర్ లో పాన్ ఇండియా మూవీ గా ఈ మూవీ భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది. ఇప్పటికే చాల వరకు షూటింగ్ పూర్తి చేసుకోగా..ప్రస్తుతం హైదరాబాద్ లో కొత్త షెడ్యూల్ మొదలుపెట్టారు. ఈ తరుణంలో ఈరోజు హైదరాబాదులోని సరూర్ నగర్ లో జరుగుతుండగా, బీజేపీ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి అడ్డుకున్నారు.

విక్టోరియా మెమోరియల్ హోం స్కూల్లో కొన్ని సన్నివేశాలు తెరకెక్కిస్తుండగా, బీజేపీ కార్యకర్తలతో కలిసి
బీజేపీ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి అక్కడికి వచ్చారు. స్కూల్లో తరగతులు జరుగుతున్న సమయంలో షూటింగ్ కు అనుమతులు ఎలా ఇచ్చారని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిపై ఆమె ధ్వజమెత్తారు. విద్యార్థులకు విద్యాబోధనను పక్కనబెట్టి సినిమా చిత్రీకరణకు అనుమతించడం ద్వారా టీఆర్ఎస్ ప్రభుత్వం ధనార్జనకే ప్రాధాన్యత ఇస్తోందని ఆమె విమర్శించారు.