లక్ష్మీబాయి వీరత్వం దేశవాసులకు స్ఫూర్తిదాయకం

ఝాన్నీ లక్ష్మీబాయికి ప్రధాని మోడి నివాళి

PM Modi
PM Modi

న్యూఢిల్లీ: నేడు ఝాన్సీ లక్ష్మీబాయి 192వ జయంతి సందర్భంగా ప్రధాని మోడి నివాళులర్పించారు. లక్ష్మీబాయి వీరత్వం దేశవాసులకు ఎప్పుడూ స్ఫూర్తిదాయకంగా ఉంటుందన్నారు. స్వాతంత్రోద్యమ మొదటి యుద్ధంలో తన అద్భుతమైన పరాక్రమాన్ని పరిచయం చేసిన ధైర్యవంతురాలైన రాణి ఝాన్సీలక్షీబాయి అని కొనియాడుతూ..మోడి ట్వీట్‌ చేశారు. కాగా, భారత స్వాతంత్ర్య సమరయోధుల్లో ఒకరైన రాణి లక్ష్మీబాయి ఇదే రోజు 1828లో వారణాసిలో జన్మించారు. మొదటి స్వాతంత్ర్య యుద్ధంగా పిలిచే 1857లో జరిగిన తిరుగుబాటులో ఆమె ముఖ్యమైన పాత్ర పోషించింది.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/