మార్చి 14 నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు

సమావేశాలకు ఆమోదం తెలిపిన గవర్నర్

AP Assembly
AP Assembly

అమరావతిః మార్చి 14 నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభంకానున్నాయి. 14వ తేదీన గవర్నర్ ప్రసంగంతో సమావేశాలు ప్రారంభమవుతాయి. ప్రసంగం తర్వాత బీఏసీ సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో అసెంబ్లీ పని దినాలను నిర్ణయిస్తారు. కనీసం 10 రోజుల పాటు సమావేశాలు జరిగే అవకాశం ఉంది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు అనుమతిని ఇవ్వాలని కోరుతూ గవర్నర్ కు ప్రతిపాదనలు పంపగా… కొత్త గవర్నర్ అబ్దుల్ నజీర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ ఉదయమే అబ్దుల్ నజీర్ గవర్నర్ గా బాధ్యతలను స్వీకరించిన సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది ఏపీ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో… సంక్షేమ పథకాలకు వైఎస్‌ఆర్‌సిపి ప్రభుత్వం పెద్ద పీట వేసే అవకాశం ఉంటుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.