బైడెన్ కొలువులో ఇద్దరు భారతీయ అమెరికన్లకు చోటు?!
వివేక్‌మూర్తి, ప్రొఫెసర్ అరుణ్ మజుందార్‌కు అవకాశం

Washington: అగ్రదేశం అమెరికా 46వ అధ్యక్షుడిగా జో బైడెన్ ఎన్నికల్లో ఘన విజయం సాధించి సంగతి విదితమే.. రానున్న జనవరి 29వ తేదీన బైడెన్ దేశాధ్యక్షుడిగా పదవీ స్వీకార ప్రమాణం చేయనున్నారు.
కాగా. ఆయన నేతృత్వంలో ఏర్పాటు కానున్న కొత్త కేబినేట్ కొలువులో ఇద్దరు భారతీయ అమెరికన్లకు చాన్స్‌దక్కే అవకాశాలు మెండుగా ఉన్నాయని తెలుస్తోంది..
బైడెన్ టీంకు సంబంధించిన జాబితా అంటూ తాజాగా ఓ మీడియా సంస్థ వెల్లడిచేసింది.
కాగా ఎన్నికల తరుణంలో బైడెన్‌కు సలహాదారుగా పనిచేసిన వివేక్ మూర్తికి కేబినేట్లోచోట్టు దక్కే అవకాశం ఉందనే ఊహాగానాలు మొదలయ్యాయి..
హెల్త్ అండ్ భ్యూమన్ సర్వీస్ మంత్రిగా నియమించే అవకాశం ఉందని సమాచారం..
43 ఏళ్ల వివేక్‌మూర్తి ప్రస్తుతం కోవిడ్-19 సహాయక సలహదారుల టీంలో ఉన్నారు..
అంతేకాదు స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ అరుణ్ మజుందార్‌కు కూడ మంత్రివర్గంలో స్థానం లభించే అవకాశం ఉందని తెలిసింది..
మెకానికల్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్ అయిన ఆయన ప్రస్తుతం అక్కడే అడ్వాన్డ్స్ రీసెర్చ్ ప్రాజెక్టస్ ఏజన్సీ డైరెక్టర్‌గా ఉన్నారు.
తాజా క్రీడా వార్తల కోసం: https://www.vaartha.com/news/sports/