కాలభైరవునికి ప్రత్యేక పూజలు చేసిన ప్రధాని మోడీ

వారణాసి: నేడు ప్రధాని మోడీ ప్రతిష్ఠాత్మక ‘కాశీ విశ్వనాథ్ కారిడార్’ ప్రాజెక్టు స్థాపన కోసం ఢిల్లీ నుంచి వారణాసి చేరుకున్నారు. ఉదయం 10.45 గంటల ప్రాంతంలో విమానాశ్రయానికి చేరుకున్న ప్రధానికి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సాదర స్వాగతం పలికారు. అక్కడి నుంచి కాలభైరవ ఆలయానికి చేరుకున్న ప్రధాని కాలభైరవుని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. షెడ్యూల్ ప్రకారం మధ్యాహ్నం 1.25 నుంచి 2.25 గంటల వరకూ శ్రీ కాశీ విశ్వనాథ ఆలయం ఇనాగరేషన్ కార్యక్రమంలో ప్రధాని పాల్గోనున్నారు. అనంతరం కారులో విశ్వనాథ ఆలయం దారిలో సర్వాంగసుందరంగా తీర్చిదిద్దిన ఆలయాలు, వీధులను పర్యవేక్షిస్తారు. కారులోనే బీఎండబ్ల్యూ గస్ట్ హౌస్‌కు చేరుకుంటారు. సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 8.45 గంటల వరకూ గంగా హారతి, ఇతర సమావేశాల్లో పాల్గొంటారు. తిరిగి రాత్రి 9.10 గంటలకు వారణాసిలోని బీఎండబ్ల్యూ గస్ట్ హౌస్‌కు చేరుకుంటారు.


కాగా, కాశీ విశ్వనాథ్ ప్రాజెక్ట్ కారిడార్‌కు 2019లో శంకుస్థాపన చేశారు. స్థానికుల నుంచి భూమి సేకరించి ఐదు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో రూ.339 కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్టును పూర్తి చేశారు. 40 పురాతన ఆలయాలను పునరుద్ధరించి, సుందరీకరించారు. కాగా, రెండు రోజుల పాటు మోడీ జరిగే వారణాసి పర్యటనలో బీజేపీ పాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు పాల్గోనున్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/