ముంబయి విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టివేత

Gold price
Gold

ముంబయిః ముంబయి విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టుబడింది. మస్కట్‌ నుంచి ముంబయి ఎయిర్‌పోర్టుకు వచ్చిన ప్రయాణికులను కస్టమ్స్‌ అధికారులు తనిఖీ చేశారు. ఈక్రమంలో ఓ వ్యక్తివద్ద 4.2 కిలోల బంగారాన్ని అధికారులు గుర్తించారు. దాని విలువ రూ.2.28 కోట్లు ఉంటుందని చెప్పారు. బంగారాన్ని పొడిగా మార్చి పాయింటు లోపల, లోదుస్తులు, మోకాలికి ధరికి క్యాప్‌ల్లో తరలిస్తున్నాడని తెలిపారు. విచారణ నిమిత్తం నిందితుడిని తమ ఆదీనంలోకి తీసుకున్నామని చెప్పారు.

కాగా, గత నెలలో ముంబయి ఎయిర్‌పోర్టులో విదేశీ సిగరేట్లను అక్రమంగా తరలిస్తున్నందుకుగాను 55 కేసులు నమోదుచేసినట్లు కస్టమ్స్‌ అధికారులు వెల్లడించారు. మొత్తం 9,36,700 సిగరెట్లను సీజ్‌ చేశామని తెలిపారు. వాటి విలువ రూ.41 లక్షలు ఉంటుందన్నారు.