ఆస్ట్రేలియా ప్రధానితో ప్రధాని మోడి చర్చలు

YouTube video
PM Modi holds virtual Bilateral Summit with Australian PM Scott Morrison

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోడి, ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్‌ మోరిసన్‌తో వీడియోస్‌ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ… ఆస్ట్రేలియాతో భారత్‌కు స్నేహపూర్వక సంబంధాలున్నాయన్నారు. ఈ ద్వైపాక్షిక సంబంధాన్ని వ్యూహాత్మక భాగస్వామ్యంగా మలుచుకుందామని పిలుపునిచ్చారు. కరోనా మహమ్మారి సంక్షోభం నుంచి ఆర్థికవ్యవస్థ త్వరగా బయటపడాలని ఆకాక్షించారు. ఈసంక్షోభ సమయాన్ని అవకాశంగా మలుచుకుందామన్నారు. భారత్‌, ఆస్ట్రేలియా పరస్పరం సహకారంతో ఎదుగుతాయన్నారు. కాగా ఆస్ట్రేలియా ప్రధానిని భారత్‌ సందర్శనకు రావాల్సిందిగా ఈ సందర్భంగా ప్రధానిమోడి ఆహ్వానించారు. ప్రస్తుత పరిస్థితులు మెరుగుపడిన తర్వాత కుటుంబ సమేతంగా భారత్‌ సందర్శనకు విచ్చే తమ ఆతిధ్యాన్ని స్వీకరించాల్సిందిగా కోరారు.


ఆస్ట్రేలియా ప్రధాని మోరిసన్‌ మాట్లాడుతూ.. ఇండో ఫసిపిక్‌ రిజీయన్‌లో పరస్పరం కలిసి పనిచేద్దామని అన్నారు. ఇరుదేశాల మధ్య శాస్త్ర, సాంకేతిక ఒప్పందాలు సంతోషదాయకమన్నారు. ఈసమావేశం ఇరు దేశాల మధ్య వాణిజ్య సంబందాలను మరింత మెరుగుపరుస్తుందని మోరిసన్‌ ఆకాంక్షించారు.


తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/