ర‌ష్యా కేఫ్‌లో అగ్నిప్ర‌మాదం.. 13 మంది మృతి

13 Killed, 250 Evacuated In Russian Cafe Fire

మాస్కోః ర‌ష్యా కేఫ్‌లో అగ్నిప్ర‌మాదం సంభవిచింది. ఈ ప్ర‌మాదంలో 13 మంది మృతి చెందారు. కోస్ట్రోమా న‌గ‌రంలో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. ప్రాథ‌మిక స‌మాచారం ప్ర‌కారం 13 మంది మృతిచెందిన‌ట్లు స్థానిక గ‌వ‌ర్న‌ర్ సెర్గీ సిట్నికోవా తెలిపారు. అగ్నిప్ర‌మాదం జ‌రిగిన బిల్డింగ్ నుంచి 250 మందిని సుర‌క్షితంగా త‌ర‌లించారు. రాత్రిపూట పోలిగాన్ అనే కేఫ్‌లో అగ్నిప్ర‌మాదం జ‌రిగిన‌ట్లు తెలిపారు. తెల్ల‌వారుజామున జ‌రిగిన ఈ ప్ర‌మాదంలో అయిదు మంది గాయ‌ప‌డ్డారు. ప్ర‌మాదం వ‌ల్ల కేఫ్‌కు ఉన్న రూఫ్ కూలిన‌ట్లు తెలుస్తోంది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/news/national/