ఉక్రెయిన్ అధ్య‌క్షుడితో ప్ర‌ధాని మోడీ సమావేశం

గ్లాస్గో: స్కాట్లాండ్‌లో ఉక్రెయిన్ అధ్య‌క్షుడు వ్లాదిమిర్ జెలెన్‌స్కీతో భార‌త ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీ భేటీ అయ్యారు. ఈ భేటీలో ఇరుదేశాల‌కు సంబంధించిన ద్వైపాక్షిక అంశాల‌పై వారు చ‌ర్చించారు. ర‌క్ష‌ణ‌, వాణిజ్య, ఆర్థిక అంశాల్లో రెండు దేశాల మ‌ధ్య సంబంధాల‌ను మ‌రింత బ‌లోపేతం చేసుకోవాల‌ని ఈ స‌మావేశంలో నిర్ణ‌యించారు. స్కాట్లాండ్ రాజ‌ధాని గ్లాస్గో న‌గ‌రంలో వీరి భేటీ జ‌రిగింది. గ్లాస్గోలో కాప్‌-26 స‌ద‌స్సు జ‌రుగుతున్న‌ది. ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ కోసం నిర్వ‌హిస్తున్న‌ ఈ సద‌స్సుకు వివిధ దేశాల అధినేత‌లు హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌ధాని మోడీ ఇత‌ర దేశాల అధినేత‌లతో భేటీ అయ్యి ద్వైపాక్షిక అంశాల‌పై మాట్లడారు.

తాజా సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/movies/