కొత్త పార్టీ పేరు ప్రకటించిన అమరీందర్ సింగ్

‘పంజాబ్ లోక్ కాంగ్రెస్’ గా పార్టీ పేరు ఖరారు
ఈసీ అనుమతి రావాల్సి ఉందని అమరీందర్ వెల్లడి


పంజాబ్: కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన కొన్ని గంటల్లోనే పంజాబ్ మాజీ సీఎం అమరీందర్ సింగ్ కొత్త పార్టీని తెరపైకి తీసుకువచ్చారు. తాను స్థాపించబోయే పార్టీ పేరు ‘పంజాబ్ లోక్ కాంగ్రెస్’ అని వెల్లడించారు. తన పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం నుంచి అనుమతి రావాల్సి ఉందని తెలిపారు.

79 ఏళ్ల అమరీందర్ సింగ్ ఇటీవలే పంజాబ్ సీఎం పదవి నుంచి తప్పుకున్నారు. పీసీసీ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూతో విభేదాలు ఆయన రాజీనామాకు కారణమయ్యాయి. ఆ తర్వాత కూడా పార్టీ నుంచి సహకారం కొరవడడంతో ఏఐసీసీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తూ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి లేఖ పంపారు.

తాజా సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/movies/