దశాబ్దాలుగా దేశానికి ఎంతో సేవ చేస్తున్నారు : ప్రధాని మోడీ

నేడు వెంకయ్యనాయుడు పుట్టినరోజు

Onam Greetings to people
pm-modi- greetings-to-Vice-President-Venkaiah-Naidu

న్యూఢిల్లీ : నేడు ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు జన్మదినం. ఈ సందర్భంగా ఆయనకు రాజకీయ, సినీ ప్రముఖులు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ‘గౌరవనీయులైన శ్రీ వెంకయ్యనాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు. కొన్ని దశాబ్దాలుగా ఆయన మన దేశానికి ఎంతో సేవ చేస్తున్నారు. మన దేశ ప్రజలకు ఆయన ఒక స్ఫూర్తి. వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి, సాంఘిక సంక్షేమం పట్ల ఆయనకున్న అభిరుచి చాలా గొప్పది. ఎన్నో ఏళ్లుగా ఆయనకు దగ్గరగా పని చేసే అవకాశం నాకు దక్కింది. ఆయనలో ఉన్న ఎనర్జీని చూసి నేను ఎప్పుడూ ఆశ్చర్యపోతుంటాను. ఉప రాష్ట్రపతిగా (రాజ్యసభ ఛైర్మన్) పార్లమెంటు ప్రొసీడింగ్స్, చర్చల స్థాయులను ఆయన పెంచారు. ఆయన నిండు నూరేళ్లు జీవించాలని ప్రార్థస్తున్నా’ అని మోడీ ట్వీట్ చేశారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/andhra-pradesh/