వెంకయ్యనాయుడుకి శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు, పవన్ కల్యాణ్

chandrababu-pawan-kalyan-greetings-to-venkaiah-naidu

అమరావతి : నేడు వెంకయ్యనాయుడు పుట్టినరోజు ఈ సందర్బంగా రాజకీయ, సినీ ప్రముఖులు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ‘తెలుగు పలుకుకు, సంస్కృతీ సంప్రదాయాలకు నిలువెత్తు రూపం వెంకయ్యనాయుడు గారు. ఆత్మీయులు వెంకయ్యనాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఏ పదవిలో ఉన్నా ప్రజాసేవను, ప్రజాస్వామ్య విలువలను మరువని మీరు… ఇలాంటి మరెన్నో పుట్టిన రోజులను సుఖసంతోషాలతో జరుపుకోవాలని మనసారా కోరుకుంటున్నాను’ అని చంద్రబాబు ట్వీట్ చేశారు.

గౌరవనీయులైన ఉప రాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ట్వీట్ చేశారు. విలక్షణమైన వ్యక్తిత్వంతో కూడిన మానవతావాది వెంకయ్యనాయుడు గారు అని కొనియాడారు. రాజకీయ పదవులు చేపట్టినా, రాజ్యాంగ పదవులు చేపట్టినా ఆ పదవుల గౌరవాన్ని ఇనుమడింపజేశారని చెప్పారు. ఆయన ప్రసంగాలు వాడిగా, వేడిగా, చమత్కారాలతో ఆలోచింపజేసేవిగా ఉంటాయని అన్నారు. ఆయన చూపే నేర్పు, ఓర్పు రాబోయే తరం నాయకులకు ఆదర్శనీయమని చెప్పారు. అమ్మ భాష తెలుగుపై ఆయనకున్న అనురాగం తననెంతో ఆకట్టుకుంటుందని అన్నారు. ఆయన మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని, ఆయనకు ఆ భగవంతుడు ఆనందకరమైన సంపూర్ణ ఆయుష్షును ప్రసాదించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నానని చెప్పారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/news/national/