ప్రధాని మోడీ సభకు ప్రత్యేక రైళ్లు

10 special trains to Prime Minister Modi sabha

హైదరాబాద్ : ప్రధాని మోడీ సభకు జనాన్ని తరలించేందుకు పది ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేశారు. ఆదిలాబాద్ నుండి ఒక రైలు నిజామాబాద్ మీదుగా సికింద్రాబాద్ కు, కరీంనగర్ నుండి కాచిగూడ కు ఒక రైలు లింగంపేట, జగిత్యాల, కోరుట్ల, మెట్పల్లి, ఆర్మూర్ మీదుగా, ఎర్రుపాలెం నుండి సికింద్రాబాద్ కు ఒక రైలు ఖమ్మం, డోర్నకల్, మహబూబాబాద్, ఆలేరుల మీదుగా, సిర్పూర్ టౌన్ నుండి సికింద్రాబాద్ కు కాగజ్ నగర్, ఆసిఫాబాద్ రోడ్, బెల్లంపల్లి మీదుగా, మంచిర్యాల నుండి సికింద్రాబాద్ కు ఒక రైలు రామగుండం, పెద్దపల్లి, జమ్మికుంట, కాజీపేట ల మీదుగా, కరీంనగర్ నుండి సికింద్రాబాద్ కు సుల్తానాబాద్, కొలనూరు, పెద్దపల్లి, కొత్తపల్లి, జమ్మికుంట, కాజీపేట, ఆలేరు ల మీదుగా, మణుగూరు నుండి సికింద్రాబాద్ కు ఒక రైలు పాండురంగాపురం, భద్రాచలం రోడ్డు, కారేపల్లి, కేసముద్రం, నెక్కొండ లమీదుగా, విష్ణుపురం నుండి సికింద్రాబాద్ కు మిర్యాలగూడ, తిప్పర్తి, చేర్యాల మీదుగా, కర్నూలు సిటీ నుండి కాచిగూడ కు ఒక రైలు గద్వాల, వనపర్తి, రోడ్ మహబూబ్నగర్ లమీదుగా, జహీరాబాద్ నుండి సికింద్రాబాద్ కు ఒక రైలు మారుపల్లి, వికారాబాద్, శంకర్పల్లి బేగంపేట ల మీదుగా చేరుకునేలా ఏర్పాటు చేశారు. అవే రైళ్లు సభ అనంతరం రాత్రి బయలుదేరి గమ్యస్థానాలకు చేరేలా ఏర్పాట్లు చేశారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/andhra-pradesh/