ఐదు వందేభార‌త్ రైళ్ల‌ను ప్రారంభించిన ప్ర‌ధాని మోడీ

pm-modi-flags-off-five-vande-bharat-trains-from-rani-kamlapati-railway-station-in-bhopal

భోపాల్‌ః ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈరోజు భోపాల్‌లోని రాణి కమలపాటి స్టేషన్ నుండి ఐదు వందేభారత్ రైళ్లను జెండా ఊపి ప్రారంభించారు. ఇందులో రెండు రైళ్లను ప్రత్యక్షంగా ప్రారంభించగా.. మరో మూడు రైళ్లను వర్చువల్ ద్వారా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్, కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. కాగా బెంగళూరు-హుబ్లీ బాలాసోర్ ప్రమాదం తర్వాత తొలిసారిగా ఐదు వందే భారత్ రైళ్లు ప్రారంభమయ్యాయి. ఈరోజు ప్రారంభమైన వందే భారత్ రైళ్లు దేశంలోని 6 రాష్ట్రాలను కలుపుతాయి. మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గోవా, బీహార్‌, ఝార్ఖండ్‌తో కనెక్టివిటీని కలిగి ఉంటాయి. ఇక దేశంలో ఇప్పటివరకు మొత్తం 23 వందేభారత్ రైళ్లు అందుబాటులోకి రాగా, బీహార్, జార్ఖండ్, గోవాలో తొలిసారిగా వందే భారత్ రైలు కూతపెట్టనుంది. మరోవైపు వచ్చే ఏడాదిలోగా దేశంలో 75 వందేభారత్ రైళ్లు నడపనున్నట్లు గత ఏడాది ప్రధాని మోడీ ప్రకటించిన సంగతి తెలిసిందే.

మోడీ ప్రారంభించిన వందే భారత్‌ రైళ్లు..
.భోపాల్-ఇండోర్
.భోపాల్-జబల్పూర్
.గోవా-ముంబై
.హతియా-పాట్నా
.బెంగళూరు-హుబ్లీ