సరిహద్దుల్లో సైన్యంతో కలిసి దీపావళి వేడుక

పొరుగు దేశాలకు పరోక్షంగా ప్రధాని మోడీ హెచ్చరికలు

PM Modi-Diwali celebration with the army at border
PM Modi-Diwali celebration with the army at border

Jaisalmer‌ (Rajasthan): సరిహద్దుల్లో భారత సైన్యంతో కలిసి ప్రధాని మోడీ దీపావళి పండుగను జరుపుకున్నారు.

శనివారం జైసల్మేర్‌ చేరుకున్న ఆయన లోంగేవాలా పోస్ట్‌ సరిహద్దులో భారత జవాన్లతో కలిసి పండుగ చేసుకున్నారు.. ఈసందర్భంగా జవాన్లకు మిఠాయిలు పంపిపెట్టారు.

సరిహద్దుల్లోఆక్రమణలకు పాల్పడుతున్న పాక్‌, చైనాకు ఆయన పరోక్ష హెచ్చరికలు జారీచేశారు.. తమ దేశ సహనాన్ని పరీక్షిస్తే ధీటైన జవాబు చెబుతామని హెచ్చరించారు..

PM Modi-Diwali celebration with the army at border

ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ, భారత్‌లోని 139 కోట్ల ప్రజానీకం రక్షణకోసం నిరంతరం పాటుపడుతున్న జవాన్లు దేశంకు అండగా ఉన్నారని అన్నారు.

జవాన్లతో ఎంత సేపు గడిపితే అంత ఎక్కువగా ఈ దేశానికి సేవ చేయాలనే తన కాంక్ష బలోపేతం అవుతోందని అన్నారు.

తాజా కెరీర్‌ సమాచారం కోసం : https://www.vaartha.com/specials/career/