లైగర్ అక్డీ పక్డీ ఫుల్ వీడియో సాంగ్ విడుదల

లైగర్ నుండి అక్డీ పక్డీ ఫుల్ వీడియో సాంగ్ వచ్చేసింది. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ – విజయ్ దేవరకొండ కలయికలో తెరకెక్కుతున్న చిత్రం లైగర్. బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్ .. బాక్సింగ్ లెజెండ్ మైక్ టైస‌న్ కీల‌క పాత్ర‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రం పాన్ ఇండియా గా పలు భాషల్లో ఆగస్టు 25న ప్రేక్షకుల ముందుకు వస్తుంది. చార్మీ పూరితో కలిసి బాలీవుడ్ మేకర్స్ కరణ్ జోహార్ హీరూ జోహార్ అపూర్వ మోహతా ధర్మా ప్రొడక్షన్స్ పై పూరి కనెక్ట్స్ తో కలిసి ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం తాలూకా టీజర్ , మేకింగ్ , స్టిల్స్ ఇలా ప్రతిదీ సినిమా ఫై అంచనాలు పెంచేస్తుండగా..తాజాగా ఈరోజు సోమవారం అక్డీ పక్డీ ఫుల్ వీడియో సాంగ్ ను విడుదల చేసింది.

లిజో జార్జ్ డీజే చేతాస్ ఈ సాంగ్ కు సంగీతం అందించగా , భాస్కర భట్ల సాహిత్యం అందించారు. అనురాగ్ కులకర్ణి రమ్య బెహెరా అలపించారు. ఈ పాటలో విజయ్ దేవరకొండ మాసీవ్ స్టెప్పులతో విజిల్స్ తో అదరగొట్టేశాడు. ముఖ్యంగా ఫ్లోర్ స్టెప్పులతో బీబత్సం సృష్టించాడు. ఫస్ట్ టైమ్ విజయ్ దేవరకొండ ఈ రేంజ్ మాస్ బీట్ కి అదరిపోయే స్టెప్పులేశాడు. అతనితో పోటీపడుతూ అనన్య పాండే గ్లామర్ షో చేస్తూ తనదైన గ్రేస్ తో ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. సాంగ్ అంత కూడా విజిల్స్ వేస్తూ సాగేలా వుంది. మరి ఈ సాంగ్ థియేటర్లో ఏ రేంజ్ లో విజిల్స్ వేయిస్తుందో చూడాలి.

YouTube video