నూతన అధ్యక్షుడు బైడెన్‌కు ప్రధాని మోడి అభినందనలు

బైడెన్‌తో కలిసి పనిచేసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నా..మోడి

న్యూఢిల్లీ: అమెరికా 46వ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన జో బైడెన్‌కు భారత ప్రధాని నరేంద్రమోడి అభినందనలు తెలిపారు. భారత్అమెరికా వ్యూహాత్మక సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు, మరింత ముందుకు తీసుకెళ్లేందుకు బైడెన్‌తో కలిసి పనిచేయడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్టు ట్వీట్ చేశారు.

ఉమ్మడి సవాళ్లను ఎదుర్కొని, ప్రపంచ శాంతి, భద్రతల సాధనకు కలసికట్టుగా పనిచేద్దామన్నారు. బైడెన్ తన పదవీకాలాన్ని విజయవంతంగా పూర్తిచేసుకోవాలని ఆశిస్తున్నట్టు పేర్కొన్నారు. రెండు దేశాల మధ్య సంబంధాలు సరికొత్త ఎత్తులకు చేరేలా బైడెన్‌తో కలిసి పనిచేస్తానని అన్నారు. నమ్మకం ఆధారంగా భారత్అమెరికా భాగస్వామ్యం కొనసాగుతుందని ప్రధాని మోడి పేర్కొన్నారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/