నేడు హైదరాబాద్‌కు రానున్న ప్రధాని మోడీ..ట్రాఫిక్ ఆంక్షలు

PM Modi coming to Hyderabad today..Traffic restrictions

హైదరాబాద్‌ః ఈరోజు సాయంత్రం హైదరాబాద్ కు ప్రధాని నరేంద్రమోడీ రానున్నారు. ఎన్నికల ప్రచారం నిర్వహించేందుకు బీజేపీ తరఫున ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం సాయంత్రం హైదరాబాద్ కు వస్తున్నట్లు బీజేపీ శ్రేణులు వెల్లడించాయి. ప్రధాని రాక కారణంగా హైదరాబాద్ లోని వివిధ రోడ్డు మార్గాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేయనున్నారు. బేగంపేట విమానాశ్రయం నుంచి రాజ్ భవన్ కు వెళ్లే దారిలో ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తున్నామని, ఈ ఆంక్షలు మంగళవారం రాత్రి 7.50 గంటలనుంచి రాత్రి 8.25 గంటల వరకు అమల్లో ఉంటాయని తెలిపారు.

తిరిగి ప్రధాని మోడీ రాజ్ భవన్ నుంచి ఎయిర్ పోర్టుకు వెళ్లే క్రమంలో బుధవారం ఉదయం 8.35 గంటల నుంచి ఉదయం 9.10 వరకు వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఇంకా వివిధ మార్గాల్లో కూడా ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు.

మే 7న ట్రాఫిక్ ఆంక్షలు ఉండే రూట్లు… (రాత్రి 7.50 నుంచి రాత్రి 8.25 గంటల వరకు) బేగంపేట ఎయిర్ పోర్ట్, ఎయిర్ పోర్ట్ వై జంక్షన్, పీఎన్ టీ ఫ్లైఓవర్ కింద రైట్ టర్న్, షాపర్స్ స్టాప్, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్, బేగంపేట ఫ్లైఓవర్, గ్రీన్ లాండ్స్, లెఫ్ట్ టర్న్, రాజీవ్ గాంధీ విగ్రహం/మోనప్ప ఐలాండ్ జంక్షన్, యశోదా హాస్పిటల్, ఎంఎంటీఎస్, రాజ్ భవన్.

మే 8న ట్రాఫిక్ ఆంక్షలు ఉండే రూట్లు… (ఉదయం 8.35 గంటల నుంచి ఉదయం 9.10 గంటల వరకు) రాజ్ భవన్, ఎంఎంటీఎస్, యశోదా హాస్పిటల్, రాజీవ్ గాంధీ విగ్రహం/మోనప్ప ఐలాండ్ జంక్షన్, రైట్ టర్న్ ప్రగతి భవన్, బేగంపేట ఫ్లైఓవర్, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్, షాపర్స్ స్టాప్, పీఎన్ టీ ఫ్లైఓవర్ కింద, ఎయిర్ పోర్ట్ వై జంక్షన్ లెఫ్ట్ టర్న్, బేగంపేట ఎయిర్ పోర్ట్.