‘నాటు నాటు’ పాటకు ‘గోల్డెన్ గ్లోబ్’ అవార్డు

ఆర్ఆర్ఆర్ లోని ‘నాటు నాటు’ పాటకు ఒరిజినల్ సాంగ్ విభాగంలో ‘గోల్డెన్ గ్లోబ్’ అవార్డు లభించింది. బాహుబలి సిరీస్ తో తెలుగు సినిమా సత్తా చాటిన డైరెక్టర్ రాజమౌళి..ఆర్ఆర్ఆర్ తో మరో స్థాయికి తీసుకెళ్లిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ , రామ్ చరణ్, అజయ్ దేవగన్ , శ్రీయ మొదలగు నటి నటులు నటించిన ఈ మూవీ పాన్ ఇండియా గా విడుదలై సంచలన విజయాన్ని సాధించింది. ఇప్పటికే ఎన్నో అవార్డ్స్ సొంతం చేసుకున్న ఈ మూవీ ప్రస్తుతం ఆస్కార్ రేసులో ఉంది. ఈ క్రమంలో సినిమాలోని ‘నాటు నాటు’ పాటకు ఒరిజినల్ సాంగ్ విభాగంలో ‘గోల్డెన్ గ్లోబ్’ అవార్డు లభించింది.

కాలిఫోర్నియాలోని ది బెవర్లీ హిల్టన్ హాల్ వేదికగా జరిగిన ఈ అవార్డుల ప్రదానోత్సవంలో బుధవారం రాజమౌళి, ఎన్టీఆర్, కీరవాణి కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. ‘నాటు నాటు’ పాటకు పురస్కారం ప్రకటించిన వెంటనే వారి ఆనందానికి హద్దే లేకుండా పోయింది. అందరూ చప్పట్లు కొడుతూ తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. దీనికి సంబదించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.