ఈ నెల 14 వరకు కవిత జ్యుడీషియల్‌ కస్టడీ పొడిగింపు

కేజ్రీవాల్ కస్టడీ ఈ నెల 20 వరకు పొడిగింపు

MLC Kavitha

న్యూఢిల్లీః ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో అరెస్టయిన కవితకు మరోసారి షాక్‌ తగిలింది. ఆమె జ్యుడీషియల్ కస్టడీని రౌస్ అవెన్యూ ప్రత్యేక న్యాయస్థానం పొడిగించింది. ఈ నెల 14 వరకు కస్టడీని పొడిగిస్తున్నట్టు కోర్టు వెల్లడించింది. ముగ్గురు కుటుంబ సభ్యులను కలిసేందుకు కవితకు కోర్టు అనుమతించింది.

మరోవైపు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కస్టడీని కూడా కోర్టు పొడిగించింది. కేజ్రీవాల్ కస్టడీని ఈ నెల 20 వరకు పొడిగిస్తున్నట్టు తెలిపింది. కవిత మార్చ్ 15వ తేదీన అరెస్టయిన సంగతి తెలిసిందే. కేజ్రీవాల్, కవిత ఇద్దరూ కూడా ఢిల్లీలోని తీహార్ జైల్లో ఉన్న సంగతి విదితమే. ఇదే కేసులో ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా ఏడాదికి పైగా జైల్లోనే మగ్గుతున్నారు.