ఓటుకు నోటు కేసు విచారణ.. కోర్టుకు రేవంత్‌ రెడ్డి

Revanth Reddy
Revanth Reddy

హైదరాబాద్‌: రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన ఓటుకు నోటు కేసులో తెలంగాణలో ఏ1, కాంగ్రెస్‌ ఎంపి రేవంత్‌ రెడ్డి ఇవాళ ఏసిబి కోర్టుకు హాజరయ్యారు. ఈ కేసు 2015లో మొదలై తెలుగు రాష్ట్రాల్లో దుమారం రేపిన విషయం తెలిసిందే. కాగా అప్పట్లో ఆయనను ఏసిబి అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. కొన్ని నెలలు ఆయన జైలులోనూ ఉన్నారు. ఈ కేసులో విచారణ ఇప్పటికీ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఏపి మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబు మినహా ఈ కేసులో నిందితులుగా ఉన్న వారంతా ఈ రోజు ఏసిబి కోర్టుకు హాజరయ్యారు. వాదనలు విన్న న్యాయస్థానం ఈ కేసులో తదుపరి విచారణను ఈ నెల 17వ తేదీకి వాయిదా వేసింది. కాగా, ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో తమ వైపునకు ఆకర్షించేందుకు తెలంగాణ నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్‌కు 50 లక్షల రూపాయలు ఇస్తూ రేవంత్‌ రెడ్డి కెమెరాకు చిక్కిన విషయం తెలిసిందే.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/