ఏపీలో EAPCET షెడ్యూల్‌ విడుదల

అమరావతి: ఏపీలో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఈఏపీసెట్‌ ఎగ్జామ్స్ షెడ్యూల్‌ను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. జులై 4వ తేదీ నుంచి 8వ తేదీ మధ్య ఏపీలో ఇంజనీరింగ్, బీ ఫార్మసీకు సంబంధించి ఎంట్రన్స్ టెస్ట్‌లు జరుగుతాయని మంత్రి ఆదిమూలపు సురేష్‌ స్పష్టం చేశారు. 11, 12వ తేదీల్లో అగ్రికల్చర్ కోర్సులో ప్రవేశానికి సంబంధించి.. ఎగ్జామ్ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఇందుకోసం 136 సెంటర్లులో ఏర్పాటు చేసినట్లు వివరించారు. అవసరం అయితే సెంటర్ల సంఖ్యను పెంచుతామన్నారు. తెలంగాణలో కూడా EAPCET ఎగ్జామ్స్ కోసం 4 సెంటర్లు ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. ఏప్రిల్ 11 న నోటిఫికేషన్ వస్తుందని చెప్పారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ.. పరీక్షలు నిర్వహించనున్నట్లు మంత్రి తెలిపారు. ఎగ్జామినేషన్ ప్యాట్రన్, ర్యాంకింగ్ ప్యాట్రన్స్‌కు సంబంధించి ఎలాంటి మార్పులు ఉండవని చెప్పారు. ఈ పరీక్షల ఫలితాలను ఆగస్టు 15 వ తేదీ కల్లా వెలువరించేందకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/