రెండు రాజధానులు అనే ప్రక్రియ బ్రిటిష్ కాలం నుంచి ఉంది
25లక్షల మంది నిరుపేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వడం ప్రపంచ రికార్డు

సింహాచలం: రెండు రాజధానులు అనే ప్రక్రియ బ్రిటిష్ కాలం నుంచి కొనసాగుతుందని డిప్యూటి సీఏం పిల్లి సుభాష్ చంద్రబోస్ అన్నారు. మంగళవారం గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీ రంగనాథ రాజుతో కలిసి ఆయన సింహాచలం వరహ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా సుభాష్ చంద్రబోస్ మాట్లాడుతూ.. చంద్రబాబు ఉచ్చులో పడిన 29 గ్రామాల ప్రజలు మినహా ప్రజలందరూ మూడు రాజధానులకు మద్దతుగా ఉన్నారని ఆయన తెలిపారు. మూడు ప్రాంతాల్లో అభివృద్ధి వికేంద్రీకరణతో రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని సుభాష్ చంద్రబోస్ అన్నారు. ఇళ్ల స్థలాల పంపిణీ ద్వారా పేదలకు ఆస్తి ఇవ్వబోతున్నామని డిప్యూటీ సీఎం తెలిపారు. అధికారంలోకి వచ్చిన 8 నెలల కాలంలోనే భారీస్థాయిలో ఇళ్ల పట్టాలివ్వడం దేశంలోనే ప్రథమం అని తెలిపారు. 25 లక్షల మంది నిరుపేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ ప్రపంచ రికార్డు అని సుభాష్ చంద్రబోస్ పేర్కొన్నారు.
తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/business/