‘నా ఆకాంక్ష ఇదే’ ప్రధాని ట్వీట్‌

PM Modi
PM Modi

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోడి గురువారం రోజు తన 70వ పుట్టిన రోజు జరుపుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా తనకు శుభాకాంక్షలు తెలిపిన వారందరికి ఆయన ట్వి‍ట్టర్‌ వేదికగా కృతజ్ఞతలు తెలిపారు. పుట్టినరోజు సందర్భంగా తనకు ఏం కావాలంటూ చాలామంది అడిగారని వారందరి నుంచి తాను ఒక్కటే కోరుకుంటున్నానని ఆయన తెలిపారు. ‘ఈ భూమిని, ప్రపంచాన్ని ఆరోగ్యవంతంగా ఉంచుదాం’ ఇదే నా ఆకాంక్ష అంటూ మోడి ఆ ట్వీట్ లో పేర్కొన్నారు. ‘మీ పుట్టిన రోజు సందర్భంగా మీరేమి ఆశిస్తున్నారంటూ చాలా మంది నన్ను అడుగుతున్నారు. ‘ఎప్పుడూ మాస్క్ ధరించండి. సరైన పద్ధతిలో ధరించండి. భౌతిక దూరాన్ని పాటించండి. రెండు గజాల దూరం అన్న అంశాన్ని మరిచిపోకండి. రద్దీ ఉన్న ప్రాంతాల్లో చేరకండి. మీమీ రోగ నిరోధక శక్తిని పెంచుకోండి. మన ప్రపంచాన్ని, సమాజాన్ని ఆరోగ్యవంతంగా ఉంచండి. నేను కోరుకునేది ఇదే’ అంటూ మోడి ట్విట్టర్‌లో పేర్కొన్నారు.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/