ప్రపంచ వ్యాప్తంగా కోటి 82 లక్షలు దాటిన కరోనా కేసులు

మరణించిన వారి సంఖ్య 6, 92, 794

worldwide Corona cases
worldwide Corona cases

ప్రపంచ వ్యాప్తంగా కరోనా విజృంభణ కొనసాగుతోంది. ఈ ఉదయానికి ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య కోటీ 82లక్షల34వేల 936కు చేరుకుంది.

అదే సమయంలో ప్రపంచంలో కరోనా కాటుకు మరణించిన వారి సంఖ్య 6లక్షల 92వేల 794కు పెరిగింది.

కరోనా కేసుల విషయంలో ప్రపంచంలోనే అమెరికా అగ్రస్థానంలో ఉండగా, బ్రెజిల్ రెండో స్థానంలో, ఇండియా మూడో స్థానంలో ఉన్నాయి.

ఆ తరువాతి స్థానాలలో వరుసగా రష్యా, దక్షిణాఫ్రికాలు టాప్ 5లో నిలిచాయి.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/