ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళ్లు అర్పించిన జూ. ఎన్టీఆర్

నేడు నందమూరి తారక రామారావు శత జయంతి సందర్భంగా జూ. ఎన్టీఆర్ ట్యాంక్ బండ్ వద్దగల ఎన్టీఆర్ ఘాట్‌కు చేరుకొని నివాళ్లు అర్పించారు. ఎన్టీఆర్ తో పాటు కళ్యాణ్ రామ్, లక్ష్మీపార్వతి తదితరులు నివాళ్లు అర్పించారు. అలాగే ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు హైదరాబాద్ లో ఘనంగా ప్రారంభమయ్యాయి.

ఈ మేరకు నివాళులు అర్పించిన అనంతరం లక్ష్మీపార్వతి మాట్లాడుతూ.. తెలుగు జాతి గర్వించదగ్గ అసమాన ప్రతిభ కలిగిన నటుడు ఎన్టీఆర్ అని, మాట తప్పని మడమ తిప్పని రాజకీయ నాయకులుగా పేరుగాంచారని ఆమె వ్యాఖ్యానించారు. అలాగే తెలుగు సినిమా ఉన్నంత కాలం ఎన్ టీ ఆర్ పేరు ఉంటుందని అన్నారు లక్ష్మీపార్వతి. ఇక చిత్రసీమ నుండి కూడా నటి నటులు , దర్శకులు , నిర్మాతలు ఎన్టీఆర్ తో పంచుకున్న క్షణాలు గుర్తు చేసుకుంటూ ఆయనకు నివాళ్లు అర్పిస్తున్నారు.