కోల్కతా చేరుకున్న ప్రధాని మోడి
స్వాగతం పలికిన సిఎం మమతా బెనర్జీ

కోల్కతా: బెంగాల్లో అంఫాన్ తుపాన్ సృష్టించిన బీభత్సం పై ప్రధాని నరేంద్రమోడి ఏరియల్ సేర్వే అంచనా కోసం కోల్కతా చేరుకున్నారు. విమానాశ్రయంలో ఆయనకు గవర్నర్ జగదీప్ ధన్కర్, ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో పాటు పలువురు అధికారులు స్వాగతం పలికారు. పశ్చిమ బెంగాల్ తో పాటు ఒడిశాలో మోడి ఏరియల్ సర్వే చేయనున్నారు. ఆ తర్వాత మొదట ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో అనంతరం ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ తో కలిసి మోడి చర్చిస్తారు. సహాయక చర్యలపై వారు చర్చిస్తారు. కాగా, తుపాను వల్ల మృతుల సంఖ్య 80కి చేరిందని మమతా బెనర్జీ ప్రకటించారు. పెనుతుపానుతో పశ్చిమ బెంగాల్లోని పలు ప్రాంతాల్లో తీవ్ర నష్టం వాటిల్లింది.
తాజా ఏపి వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/